ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

83చూసినవారు
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం
ఏప్రిల్‌ 3 నుంచి 7వరకు టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్టేట్‌ మొత్తంలో 26 జిల్లా కేంద్రాల్లో, రోజుకు 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేస్తారని వెల్లడించింది. మూల్యాంకనం చేసిన పత్రాల పునఃపరిశీలనలో మార్కులు తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతోపాటు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఏప్రిల్‌ చివరిలో టెన్త్ రిజల్ట్స్ రానున్నాయి.

సంబంధిత పోస్ట్