BJP నాయకుడిని కొట్టిన RPF జవాన్ (వీడియో)

85చూసినవారు
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బరేలీలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అజయ్ గుప్తా అనే బీజేపీ నేత తన స్కూటర్‌పై వెళుతున్న క్రమంలో ఓ RPF జవాన్ కారును ఓవర్‌టేక్ చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన జవాన్ అజయ్ గుప్తాపై దాడికి దిగి, దారుణంగా కొట్టాడు.ఈ దాడిలో అజయ్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్