యూపీలోని వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. బాలిక తన స్నేహితురాలితో కలిసి సైకిల్‌పై స్కూల్‌కు బయలుదేరింది. ఓ ట్రాక్టర్ అతను వేగంగా ఆమె పక్క నుంచి వెళ్లాడు. ఈ క్రమంలో సైకిల్ హ్యాండిల్ ట్రాక్టర్‌కు తగలడంతో అదుపుతప్పి కిందపడింది. ట్రాక్టర్ వెనుక చక్రం ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.