తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

73చూసినవారు
తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలుగులో విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇది ఆశ, ఉత్సాహాలతో ముడిపడి ఉన్న ఒక ప్రత్యేక పండుగ అని, ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సును, విజయాలనీ తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. సంతోష, సామరస్యాల స్ఫూర్తి వృద్ధి చెందుతూ మరింతగా వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్