AP: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. వేడుకల సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం చేశారు. మంత్రులు దుర్గేష్, ఆనం రామనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.