గ్రామాల అభివృద్ధే మా లక్ష్యం : వి.పి.ఆర్

62చూసినవారు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేలా గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం గారితో కలిసి పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న వి.పి.ఆర్, ఇంటూరి నాగేశ్వరరావుకి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూలవర్షం మధ్య తమ అభిమాన నేతలను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై ఎక్కిన వేమిరెడ్డి. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.ప్రచారంలో భాగంగా వి.పి.ఆర్ మాట్లాడుతూ,ఇంత ఘనంగా మాకు స్వాగతం పలికిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా రామాయపట్నం పోర్టు పూర్తి కావడం లేదని, చంద్రబాబు సీఎం అయితే రామాయపట్నం పోర్టును వేగంగా అభివృద్ధి చేసి ఎగుమతులు జరిగేలా చూస్తామన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకార సోదరుల బోట్ల రిపేర్లకు ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. కరేడు బీచ్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చూపుతామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు అధునాతన జి పి ఎస్ ట్రాకెర్స్ పరికరాలు ఉచితంగా అందిస్తారన్నారు. వేట విరామ సమయంలో వైసీపీ ప్రభుత్వం 10 వేలు ఇచ్చేవారని, అదికూడా కొందరికే అందేదన్నారు. మన ప్రభుత్వం వస్తే 20 వేలు మీకు అందిస్తారని చెప్పారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే అటు దేశం, ఇటు రాష్ట్రం బాగుపడతాయని చెప్పారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు గారు సీఎం అవ్వాలని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావును, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్