నెల్లూరు: గుంత ఉందని బ్రేక్ వేస్తే ప్రాణాలే పోయాయి

68చూసినవారు
నెల్లూరు: గుంత ఉందని బ్రేక్ వేస్తే ప్రాణాలే పోయాయి
నెల్లూరు సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందింది. భార్యాభర్తలు స్కూటీపై వెళ్తుండగా రోడ్డు మధ్యలో గుంతను తప్పించబోయి బ్రేక్ వేసినప్పుడు భార్య కింద పడి, వెనుక నుండి వచ్చిన పొట్టులోడు ట్రాక్టర్ ఆమెపై ఎక్కడంతో మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం, పెద్దచెరుకూరు గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో భర్త ప్రసాద్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్