TG: మంత్రి పోన్నం ప్రభాకర్ బీఆర్‌ఎస్ నాయకులపై అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని, అసెంబ్లీలో బలహీన వర్గాలకు సంబంధించిన అంశంపై చర్చిస్తుంటే ప్రతిపక్షం తరఫున సభలో నలుగురు కూడా లేరని అన్నారు. బలహీన వర్గాల పట్ల బీఆర్‌ఎస్‌కు బాధ్యత లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగా బలహీన వర్గాల అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.