కోటంరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కళ్యాణ్
టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు. జిల్లా పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన శుక్రవారం నెల్లూరు నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిని పవన్ అడిగి తెలుసుకోవడంతో పాటు రూరల్లో భారీ మెజార్టీతో గెలవాలని ఆకాంక్షించారు