నెల్లూరు: స‌ప్ర మ‌హోత్స‌వంలో మంత్రి నారాయణ

61చూసినవారు
నెల్లూరు న‌గ‌రం క‌పాడిపాళెంలోని సెయింట్ జోస‌ఫ్ చ‌ర్చిలో బుధవారం క్రిస్మ‌స్ వేడుక‌లు అత్యంత ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌ను నిర్వాహ‌కుల ఆహ్వానం మేర‌కు రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చ‌ర్చికి వ‌చ్చిన మంత్రికి నిర్వాహ‌కులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. అనంత‌రం బాల‌యేసు స‌ప్ర మ‌హోత్స‌వంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్