50 ఏళ్లకే రూ. 4 వేలు పింఛన్ అందిస్తాం: సోమిరెడ్డి

78చూసినవారు
50 ఏళ్లకే రూ. 4 వేలు పింఛన్ అందిస్తాం: సోమిరెడ్డి
తాము అధికారంలోకి రాగానే 50 ఏళ్లకే 4వేల రూపాయలు పింఛను అందజేస్తామని మాజీ మంత్రి, టిడిపి సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలంలోని ఆనాటి కండ్రిక, వరదాపురం, విరువూరు, నల్లపాలెం, సూరాయపాలెం, తాటిపర్తి గ్రామాల్లో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేదరుమల్లిలో వైసీపీని వీడి 18 కుటుంబాలు, అలాగే ప్రభగిరి పట్టణానికి చెందిన 16 కుటుంబాలు టిడిపిలో చేరాయి.

సంబంధిత పోస్ట్