పొదలకూరులోని శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి వేడుకలను ఆదివారం స్థానిక ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల నేడు తెలుగు వారందరూ గర్వంగా జీవిస్తున్నారని తెలిపారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష ఫలితంగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.