వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని అబ్దుల్ కలాం భవనంలో, విద్యార్థుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి ప్రవేశోత్సవ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ప్రోత్సహిస్తూ విశేషంగా ప్రసంగించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సునీత హాజరయ్యారు.