నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని గ్రామదేవత కలిగిరమ్మ తల్లి తిరుణాళ్ళు గురువారంతో ఘనంగా ముగిసాయి. చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాగా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు ఇది ఎంతో పెద్ద పండుగ. చివరగా సాయంత్రం సుడిమాను తిప్పడంతో కలిగిరమ్మ తిరునాళ్లు ఘనంగా ముగిసాయి. భారీగా భక్తులు తరలిరావడంతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి.