ఉదయగిరిలో తీవ్ర రూపం దాల్చిన కుక్కల బెడద

63చూసినవారు
ఉదయగిరిలో తీవ్ర రూపం దాల్చిన కుక్కల బెడద
ఉదయగిరి పట్టణంలో కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. నానాటికి వీటి ఆగడాలు భరించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పట్టణంలోని షామీషా వీధి, మెయిన్ బజార్, యూనియన్ రోడ్డు, సినిమా హాల్ సెంటర్, షాది మహల్, ఎస్సీ కాలనీ, ఇంద్రానగర్ కాలనీ, మంగళకట్ట తదితర ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ పలువురుపై దాడికి దిగుతున్నాయి. అనేకమంది వీటి కాటుకు గురై వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్