కలిగిరి మండలం దూబగుంట గ్రామంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, వారి తనయుడు కాకర్ల సంహిత్ తో కలసి గురువారం పర్యటించారు. ముందుగా టిడిపి కార్యకర్త అయినటువంటి పిచ్చపాటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. తదనంతరం ఎమ్మెల్యేని, వారి కుమారుడు కాకర్ల సంహిత్ ని గ్రామ టిడిపి నాయకులు శాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు.