కొండాపురం మండలంలోని గానుగపెంట సాగునీటి సంఘాల పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య ఆందోళన చెలరేగింది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నామని కానీ ఇప్పుడు తమకు గుర్తింపు ఓ వర్గం వారు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని బహిష్కరించిన వారికి అవకాశం ఇవ్వడం ఏంటి అని ఫైర్ అయ్యారు. ఇదంతా తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు.