ఉదయగిరిలో లోక్ అదాలత్

58చూసినవారు
ఉదయగిరిలో లోక్ అదాలత్
ఉదయగిరి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉదయగిరి మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సందిరెడ్డి రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజీ పడదగిన ప్రతి కేసు రాజీ చేసుకోవచ్చన్నారు. ఈ అదాలత్ లో సివిల్, ఆస్తి, చెక్ బౌన్స్, బ్యాంకు రుణాలు, భార్యాభర్తల వివాదాలు లాంటి పలు కేసులు రాజీ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చన్నారు.