సీతారాంపురం మండలంలోని పబ్బులేటి పల్లి గ్రామంలో ప్లోరోసిస్ పై గ్రామస్తులతో అవగాహన కార్యక్రమాన్ని వైద్యాధికారిణి డాక్టర్ స్వప్న నిర్వహించారు. మనం తాగే నీటిలో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉండడం వలన ప్లోరోసిస్ వస్తుందని తెలిపారు. ఫ్లోరిన్ లేని నీటిని తాగాలని సూచించారు. ఫ్లోరోసిస్ వల్ల వచ్చే వ్యాధులు, వాటి యొక్క లక్షణాలను వివరించారు. ఆహారాన్ని మట్టి పాత్రల్లో చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు.