ఉదయగిరి: అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేసిన సిడిపిఓ

67చూసినవారు
ఉదయగిరి: అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేసిన సిడిపిఓ
ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సీడీపీవో టి. శారద మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని చిన్నారుల ఎత్తు, బరువును తనిఖీ చేశారు. అనంతరం గర్భవతులు, బాలింతలకు అందాల్సిన పోషక పదార్థాల పంపిణీపై ఆరా తీశారు. పట్టణంలోని బీసీ, ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా రెండు రోజుల క్రితమే ఉదయగిరి నూతన సిడిపిఓగా శారద బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్