ఇటీవల మోస్తారు వర్షాలు కురవడంతో సెనగ సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఉదయగిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రైతులు సెనగ సాగు చేసేందుకు చూస్తున్నారు. సబ్సిడీ సెనగ విత్తనాల కోసం ఇప్పటికే రైతులు రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయినప్పటికీ ఇంతవరకు విత్తనాలు పంపిణీ జరగకపోవడంతో ఆలస్యం అవుతుందని రైతులు ఆందోళన తెలిపారు. పంటవేసే సమయం దాటిపోతే సాగు సరిగా పండదని భయపడుతున్నారు.