పట్టణంలోని కావలి రోడ్డు మార్గంలో ఉన్న సర్వే నెంబర్ 1281/2 లో 42 మాదిగ కుటుంబాలకు గతంలో ఇందిరమ్మ కాలనీలు, పట్టాలు మంజూరు చేశారు. ఆ తర్వాత సంచార జాతులు ఆక్రమించుకోవడంతో అప్పట్లో పోరాటాలు, ఆందోళన చేపట్టిన తర్వాత 2014లో ప్రభుత్వం తిరిగి రెవెన్యూ శాఖ పట్టాలను మాదిగ కుటుంబాలకు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కొంతమంది ఆ స్థలంపై కన్నేసి నిర్మాణాలు చేపడుతున్నారని బుధవారం తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు.