ఉదయగిరి పట్టణంలోని ఐసిడిఎస్ (అంగన్వాడీ) కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కలు అధ్వానంగా ఉన్నాయి. ప్రతి నెలా ఇక్కడ ప్రాజెక్ట్, సెక్టార్ మీటింగ్ లు జరుగుతుంటాయి. అంగన్వాడీ సిబ్బంది మీటింగ్ సమయాల్లో ఇక్కడే కూర్చోవాలి, అలాగే ఏదైనా పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు సైతం ఇక్కడే వేచి ఉండాలి. వారందరికీ ఈ చెట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. సిడిపిఓ బదిలీపై వెళ్లడం పర్యవేక్షణ కొరవడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడింది.