ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలి అనుకున్న అక్రమార్కులను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియ గ్రామం పరిధిలో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు చదును చేస్తుండగా సమాచారం అందుకున్న తహసిల్దార్ సుభద్ర రెవెన్యూ సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించాలని ప్రయత్నిస్తే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని తహసిల్దార్ సుభద్ర హెచ్చరించారు.