నెల్లూరు జిల్లాలో ఓ అధికారి నిర్లక్ష్య వైఖరి బయటపడింది. వరికుంటపాడు వెలుగు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం వరకు విధులకు ఏపియం హాజరు కాలేదు. కోపరేటివ్ సొసైటీ వారోత్సవాల సమావేశంలో భాగంగా ఏపియం కోసం మహిళలు, సిబ్బంది ఎదురు చూశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఏపియం ల గైర్హాజరు పరిపాటిగా మారిందని పలువురు ఆరోపించారు. కనీసం ఓ కార్యక్రమం జరిగే రోజైనా ముందుగా రావాలి కదా అంటూ విమర్శలు గుప్పించారు.