ఏపీలో ఫైబర్‌నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఫైబర్‌నెట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేసిన ఆర్థిక అవకతవకలతో ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రభుత్వ నిధలు దుర్వినియోగం చేశారని, అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు యత్నించారని జీవోలో అధికారులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేశారని తెలిపారు.