మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి
మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. ఆదివారం బాపులపాడు మండలంలోని రంగయ్య అప్పారావుపేట నుండి రామన్న గూడెం వరకు సుమారు 6.5 కిలోమీటర్ల మేర రూ.5.41 కోట్ల వ్యయంతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.