జగ్గయ్యపేట మండలo తిరుమలగిరి గ్రామoలోని వెంకటేశ్వరస్వామి వారి దేవ స్థానంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనoగా జరిగాయి. ఆలయ సహాయకమిషనర్, కార్యనిర్వహణాధికారి నూతక్కి వెంకట సాంబశివరావు త్రివర్ణ పతాకాన్ని ఆలయ కార్యాలయం ఎదుట ఎగురవేయుట జరిగినది. ఈ జెండా వందనం కార్యక్రమoలో తిరుమలగిరి గ్రామ విద్యార్ధిని విద్యార్ధులు, తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.