ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు ఒక ఆయుధం వంటిదని ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు పిలుపునిచ్చారు. మే 13న ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండర్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ట్రాన్స్‌జెండర్ ఓటర్లను జాగృతం చేసే కార్యక్రమం జరిగింది.