AP: ఏపీలో అన్ని రంగాల అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోల్ ఇండియా ఎండీ ప్రసాద్ తెలిపారు. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ ఎక్స్ పో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు సీఎం కావడం ఏపీకి శుభపరిణామమన్నారు. బిజినెస్ ఎక్స్ పోకి మంచి స్పందన వచ్చిందన్న ఆయన.. ఇలాంటి ఎక్స్ పోల ఏర్పాటుతో ఇన్నోవేటివ్ ఆలోచనలు వస్తాయన్నారు.