AP: రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అవుతుందని వైఎస్ జగన్ అన్నారు. గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్‌కు ఎంత ఇస్తున్నారు..? ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుంది. అందుకనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కాలయాపన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడవద్దని సూచించారు.