టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ అవార్డు విషయమై తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు స్పందించారు. 'నా ప్రియమైన మిత్రుడికి శుభాకాంక్షలు. ఈ గౌరవానికి నువ్వు అర్హుడివి. అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నాను. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం' అంటూ మోహన్ బాబు తన ఎక్స్ పేజీలో రాసుకొచ్చారు.