బాణసంచా దూసుకెళ్లి.. ఆటో ప్రయాణికులకు గాయాలు
వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. స్థానికులు తెలిసిన సమాచారం మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువులోని వినాయకుడి విగ్రహ మహోత్సవ కార్యక్రమంలో బాణాసంచా కాలుస్తున్న సమయంలో బాణాసంచా ఆటోలోకి దూసుకెళ్లి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.