గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవీ మెగా జాబ్ మేళా బ్రోచర్ ని ఆవిష్కరించారు. జీటీ రోడ్డులోని
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం హెచ్ ఆర్ అండ్ కో సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరుకి జరగనున్న మేళాకి సంబంధించిన తేదీ, వేదికని త్వరలో ప్రకటిస్తామన్నారు.