సోషల్ మీడియాలో హద్దులు దాటితే చర్యలు: ఏఎస్పీ
సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదైనట్లు అదనపు ఎస్పీ రమణ మూర్తి తెలిపారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో శనివారం రమణ మూర్తి మీడియాతో మాట్లాడారు. తాజాగా కళ్లం హరికృష్ణా రెడ్డి, సుధారాణికి న్యాయస్థానం రిమాండ్ విధించి సబ్-జైలుకి పంపించడం జరిగిందని చెప్పారు. సుధారాణిపై 3 జిల్లాల్లో 9 కేసులు ఉన్నాయని, కళ్లం హరికృష్ణారెడ్డిపై తాడికొండ స్టేషన్లో మర్డర్ కేసు కూడా ఉందన్నారు.