తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం

51చూసినవారు
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం
పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి అంగన్వాడీ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గర్భిణీలకు, బాలింతలకు తల్లిపాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తాగించాలని. పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని వివరించారు.

సంబంధిత పోస్ట్