ఫారెస్ట్ భూములలో రెండవ రోజు కొనసాగుతున్న సర్వే
మాచవరం మండలం చెన్నాయిపాలెం పరిధిలో రెండవ రోజు ఆదివారం సర్వే కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు సరస్వతి పవర్ ప్లాంట్ భూములకు సంబంధించి ఫారెస్ట్ భూములు ఏమైనా కలిశాయా అనే అంశంపై ఫారెస్ట్ అధికారులు 2రోజుల నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ దాచేపల్లి సెక్షన్ డీఆర్ఎ విజయలక్ష్మి, వేమవరం బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, మాదినపాడు బీట్ ఆఫీసర్ మనోజ్ పాల్గొన్నారు.