
దుర్గిలో కొనసాగుతున్న భూ రీ సర్వే
దుర్గి గ్రామపంచాయతీలో భూ సర్వే కొనసాగుతుందని గురువారం తహసీల్దార్ ఫణీంద్ర కుమార్ తెలిపారు. తహసీల్దార్ మాట్లాడుతూ, దుర్గిపంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు. గడిచిన రెండు రోజుల నుంచి రీసర్వే చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 50 ఎకరాల పైనే రీసర్వే చేశామని ఆయన తెలిపారు. రీ సర్వేలో రఘుపతి, అశోక్ సర్వేర్లు పాల్గొన్నారు.