కారంపూడి మండలంలో ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం సీఐ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తుంటారని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు జరగడానికి వీలులేదని, కోడిపందాల సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు.