గుంటూరు: ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద ఉద్ధృతి
ఎగువన నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో తాడేపల్లి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు ప్రధాన వాగుల నుంచి 2 లక్షల 36 వేల 158 క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి చేరుతున్నట్టు ఇరిగేషన్ శాఖ జేఈ రాజేశ్ శుక్రవారం తెలిపారు. బ్యారేజి రిజర్వాయర్లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా 70 గేట్లను 5 అడుగుల మేరఎత్తి 2లక్షల 20వేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.