నరసరావుపేట వన్ టౌన్ సీఐ విజయ్ చరణ్ గురువారం రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నరసరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో, సీఐ విజయ్ చరణ్ కు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపినందుకు ప్రశంసా పత్రంను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పొల్గొన్నారు.