రాష్ట్ర సాహిత్య సంక్రాంతి సంబరాలలో నరసరావుపేటకి చెందిన గుండాల రాకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వై ఎం హెచ్ ఏ హాల్ నందు నిర్వహించిన సాహిత్య సంక్రాంతి సంబరాలలో రాకేష్ కు ఘన సన్మానం నిర్వహించి, 5000 రూపాయల రివార్డ్ తో పాటు జ్ఞాపిక, సర్టిఫికేట్ శాలువాతో ఘనంగా సత్కరించారు.