మన వార్డును మనమే బాగు చేసుకోవాలి, మన కాలువలను మనమే శుభ్రం చేసుకోవాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరు కలిసి రావాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేటలో పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ఎమ్మెల్యే సైడ్ కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు.