హైస్కూల్లో విద్యార్థులకు "మాక్ పోల్"

66చూసినవారు
హైస్కూల్లో విద్యార్థులకు "మాక్ పోల్"
పెదకూరపాడు మండలం త్యాళ్లూరు జడ్పీ హైస్కూల్లో గురువారం యాక్టిజెన్ క్లబ్‌ విద్యార్థులకు మాక్ పోల్ ను నిర్వహించారు. దీనిలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. మాక్ పోల్ విద్యార్థులకు ఎన్నికల భావనను పరిచయం చేయడానికి, ప్రజాస్వామ్యం, ప్రభుత్వం, పార్లమెంటు పాత్రపై అవగాహన కలుగుతుందని హెచ్ఎం ఎ. శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ‌ ప్రక్రియను ఉపాధ్యాయులు సుగుణావతి, శ్రీనివాసరావులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్