గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించటం శ్రేయస్కరమని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం సత్తెనపల్లి మండలంలోని ఫణిదం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాగులూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. ఫౌండేషన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజసేవకు పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మాగులూరి హరిబాబు పాల్గొన్నారు.