తుళ్లూరు: వీధి కుక్కల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వీధి కుక్కలు విలయతాండవం చేస్తున్నాయని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి అన్నారు. శనివారం తుళ్లూరు మండలంలోని వెలగపూడి అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. ఈ సమస్య గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల సమస్య జటిలంగా మారిందన్నారు. చీకటి పడితే ప్రజలు ఇళ్లకు వెళ్ల లేకుండా చేస్తున్నాయని, పసి పిల్లల ప్రాణాలు సైతం తీస్తున్నాయని చెప్పారు.