తెనాలి సబ్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 8అర్జీలు వచ్చాయి. రెవెన్యూ, హౌసింగ్, మార్కెటింగ్, జీజీహెచ్, ఐసీడీఎస్ తదితర విభాగాల సమస్యలపై పలువురు అర్జీలు సమర్పించినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీధర్ బాబు తెలిపారు. ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. పీజీఆర్ఎస్లో పలు విభాగాల అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు.