నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపూర్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి దంపతులు మహేశ్వర్ రెడ్డి, శాంతి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతుల కొడుకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో అప్పులు అధికమయ్యాయి. అప్పుల బాధ భరించలేక మహేశ్వర్ రెడ్డి, శాంతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.