ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని సజ్జల అన్నారు. ఇందుకోసం పార్టీ సెంట్రల్ ఆఫీసులో జనరల్ సెక్రటరీలు, రీజనల్ కో ఆర్డినేటర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. కమిటీ ఏర్పాట్లపై పార్టీ అధినేత జగన్ దృష్టి పెట్టారని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని ఆయన సూచించారు.