AP: టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబసభ్యులను ఫోన్ కాల్ లో సీఎం చంద్రబాబు పరామర్శించారు. రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. టీడీపీ కార్యకర్త హత్యకు గురికావడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, శనివారం పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యకు గురైన విషయం తెలిసిందే.